Kodo Millets in Telugu: Health Benefits of it

0
3041
Kodo Millets in Telugu Aarikalu Millet

Kodo Millets నీ Telugu లో అరికలు (Arikalu Millets) అని పిలుస్తారు. చిరు ధాన్యాల్లో అరికెలు ఒక‌టి. ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా అనేక పోష‌క విలువ‌లు అధికంగా ఉంటాయి.

ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోష‌ణ‌ను అందిస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు అరికెలను తీసుకుంటే రక్త శుద్ధి జరిగి త్వరగా కోలుకునేందుకు దోహదపడతాయి. అరికెలలో అధికమొత్తంలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి.

ఆకలి తీర్చడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అరికెలు ద్వారా అందుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి.

అరికలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం.

అరికలు మిల్లెట్లలో పోషక విలువలు: (Nutrition Values in Kodo Millets in Telugu):

Nutritional components Value per 100 g 
Carbohydrate 59.2 g 
Protein 10.6 g 
Fibre 10.2 g 
Fats 4.2 g 
Phosphorus 188 mg 
Potassium 107.8 mg 
Calcium 27.0 mg 
Sodium 3.48 mg 
Vitamin B3 2.0 mg 
Zinc 1.58 mg 
Iron 0.5 mg 
Vitamin B5 0.28 mg 
Vitamin B1 0.18 mg 
Vitamin B2 0.09 mg 
Folate 33.06 mcg 
Vitamin K 0.5 mcg 
Arikalu or Kodo Millets Nutritional Value Chat Per 100g Facts

Health Benefits & Use’s of Kodo Millets in Telugu:

  1. అరికెల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ స‌మ‌స్యలు ఉండ‌వు. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.
  2. ప్రేగు క్యాన్సర్ వాటిని దరిచేరకుండా అరికెలు నివారిస్తాయి.
  3. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అరికెలు మంచి ఆహారం. వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు.
  4. దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెల మంచి ఆహరం.
  5. వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు రోజు వారిగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
  6. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను అరికెలు త‌గ్గిస్తాయి.
  7. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారు వీటిని తింటే మంచిది.
  8. మ‌హిళ‌లు అరికెల‌ను తిన‌డం వ‌ల్ల వారికి నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
    గుండె జ‌బ్బులు ఉన్న‌వారు తింటే తీవ్ర‌మైన దుష్ప‌రిణామాలు ఏర్ప‌డ‌కుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు.
  9. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రి పూట అరికెలతో కూడిన ఆహారం తీసుకుంటే నిద్రబాగా పడుతుంది.
  10. అరికెలలో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  11. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజువారి ఆహారంగా అరికెలు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here